#395Telugu Spiritual Song
Randi randi Yesuni yoddaku - Rammanu chunnadu
రండి రండి యేసుని యొద్దకు - రమ్మనుచున్నాడు
ప|| రండి రండి యేసుని యొద్దకు - రమ్మనుచున్నాడు
అ.ప. ప్రయాసపడి భారము మోయువారలు - ప్రభునిచెంతకు పరుగిడి వేగమె
1. యేసుని పిలుపు వినియు నింక - యోచింపరేల
అవనిలో అగచాట్ల పాలైన - అబ్బదు శాంతి ఆత్మకు నిలలో || రండి ||
2. కరువు రణము మరణము చూచి - కలుగదు మారుమనస్సు
ప్రవచనములు సంపూర్ణము లాయెను - యూదులు తిరిగి వచ్చుచున్నారు || రండి ||
3. ప్రభు యేసు నీ కొరకై తనదు - ప్రాణము నిచ్చెగదా
సిలువను రక్తము చిందించియును - బలియాయెను ఆ ఘనుడు మనకై || రండి ||
4. యేసు నామమునందే పరమ - నివాసము దొరుకును
ముక్తిని పాప విమోచనమును - శక్తిమంతుడు యేసే యిచ్చును || రండి ||
5. నేనే మార్గము నేనే సత్యము - నేనే జీవమును
నేనే గాకింకెవ్వరు లేరని - యెంచి చెప్పిన యేసుని యొద్దకు || రండి ||
