18px
#396Telugu Spiritual Song

Kriste sarvaadhikaari – kriste alpha omega

క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే అల్ఫా ఓమేగ

ప|| క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే అల్ఫా ఓమేగ ఆది యంతము క్రీస్తే - యుగాయుగములు క్రీస్తే
1. మనల రక్షించనెంచి - సిలువలో ప్రాణమిచ్చె తగ్గించుకొనినవాడై - తన ప్రేమనెంతో జూపె || క్రీస్తే ||
2. నీదు రక్షణ కొరకై - ప్రభు సమయ మిచ్చుచుండె నేడే రక్షణ దినము - అంగీకరించు మిపుడే || క్రీస్తే ||
3. ఆయన ప్రత్యక్షత - ప్రేమించువారి కొరకు ప్రభు తిరిగి వచ్చుచుండె - పరలోక మహిమతోడ || క్రీస్తే ||
4. ఎవ్వరెవ్వరి వస్ర్తములు - పరిశుద్ధ పరచబడెనో వారే ప్రభురాక యందు - సంతోషించెదరు మిగుల || క్రీస్తే ||
5. ప్రభు సేవలోని శ్రమలు - కరిఠన దుఃఖ బాధల్ బహుమానములుగ మారి - కాంతికిరీట మౌను || క్రీస్తే ||
6. ఆనంద భాష్పములతో - హల్లెలూయ పాటలు పాడుచు ప్రభుని మహిమ - పరతురు హల్లెలూయ || క్రీస్తే ||