#397Telugu Spiritual Song
Saatilenidi yesuni rakhtamu paapamunu kadugunu
సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును
ప|| సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును
ప్రియుడా పాపమును కడుగును
1. చూడుము సోదరా దేవుడు ఎంతో - ప్రేమించె ఈ జగతిన్
ప్రియుడా ప్రేమించె ఈ జగతిన్ - సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు
యేసుని పంపెను - ప్రియుడా యేసుని పంపెను || సాటి ||
2. లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు - ప్రాణము బలిగానిచ్చె
ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చె - లోకపాపమెల్ల సిలువలో మోసి
తొలగించె శాపమున్ - ప్రియుడా తొలగించె శాపమున్ || సాటి ||
3. వినుము సోదరా ప్రభుయేసు క్రీస్తుని - పరలోక వార్తను
ప్రియుడా పరలోక వార్తను - ఉన్నతమైన పరలోక ప్రేమను
చాటించు చుంటిమి - ప్రియుడా చాటించు చుంటిమి || సాటి ||
4. యేసుని నీవు క్షమించుమని వేడు - విరిగిన హృదయముతో
ప్రియుడా విరిగిన హృదయముతో - యేసుని అమూల్య రక్తధారలే
కడుగును పాపమెల్ల - ప్రియుడా కడుగును పాపమెల్ల || సాటి ||
5. పాప భారమును మోసికొని నీవు - ప్రయాస మొందెదవా?
ప్రియుడా ప్రయాస మొందెదవా? - పాపమొప్పుకొని యేసు పాదముల
చెంతకు జేరుము - ప్రియుడా చెంతకు జేరుము || సాటి ||
6. గతించుచున్నది స్వల్ప జీవితము - శ్రీఘముగా రమ్ము
ప్రియుడా శ్రీఘముగా రమ్ము - కర్త యేసునందు విశ్వాసముంచి
రక్షణ పొందుము - ప్రియుడా రక్షణ పొందుము || సాటి ||
7. కృపయానందము పవిత్ర ప్రేమలో - భాగము పొందుము
ప్రియుడా భాగము పొందుము - పాప సాగరమును దాటించ గలడు
యేసు రక్షకుడే - ప్రియుడా యేసు రక్షకుడే || సాటి ||
