18px
#399Telugu Spiritual Song

Entho goppa nityamaina - poorna rakshana ide

ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ యిదే

ప|| ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ యిదే నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ
1. మన ప్రభువే రక్షణ శృంగమాయె - శత్రువు నోడించ శక్తిమంతుడు మనకు జయము నిచ్చును || ఎంతో ||
2. ప్రభువే మన రక్షణ శైలమాయె - దృఢపరచె నాయనె మనల పాదముల స్థిరపరచెను || ఎంతో ||
3. ప్రభువే మన రక్షణ దుర్గమాయె - తనయందే మనకు పూర్ణ భద్రత ప్రియమార దయచేయును || ఎంతో ||
4. ప్రభువే మన రక్షణ కేడెమాయె - దుష్టుని బారినుండి తప్పించి పదిలముగా రక్షించును || ఎంతో ||
5. ప్రభువే మన రక్షణ శిరస్ర్తాణము - జీవము ద్వారా రక్షణ కనుపరచ ఆశతోడ నుందుము || ఎంతో ||
6. రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నది - రక్షణ ఊటచే సంతృప్తి కలిగె పరిపూర్ణత నీవేగా || ఎంతో ||
7. రక్షణ వస్ర్తము ధరింపజేసెనుగా - నీతి వస్ర్తమును ధరింపజేసిఆనందింపజేసెను || ఎంతో ||