18px
#400Telugu Spiritual Song

Prematho Yesu – piluchuchunnaadu rammu

ప్రేమతో యేసు - పిలుచుచున్నాడు రమ్ము

ప|| ప్రేమతో యేసు - పిలుచుచున్నాడు రమ్ము రక్షణను పొంది - లక్షణముగా వెళ్లుము
1. పాపమెరుగని ప్రభు నీ కొరకు - పాపముగను చేయబడెను శాపగ్రాహియాయె సిలువలో - శాపగ్రాహియాయె సిలువలో పరుగిడి రమ్ము || ప్రేమ ||
2. ముండ్ల కిరీటమును ధరించి - ముఖముపై నుమ్మి వేయబడె ప్రాణమిడె నేసు సిలువలో - ప్రాణమిడె నేసు సిలువలో పరుగిడి రమ్ము || ప్రేమ ||
3. సిలువలో నీకై దప్పిగొని - కలుష నీ క్షమకై ప్రార్థించి సహించి ప్రాణమిడె నీ కొరకు - సహించి ప్రాణమిడె నీ కొరకు పరుగిడి రమ్ము || ప్రేమ ||
4. తప్పిన గ్రొరెను రక్షింప - తనదు రక్తమును చిందించె కాపరి స్వరము ధ్వనించె - కాపరి స్వరము ధ్వనించె పరుగిడి రమ్ము || ప్రేమ ||
5. తామసించ తగదిక ప్రియుడా - త్వరపడుము నీ రక్షణ కొరకు నేడే నీ రక్షణ దినము - నేడే నీ రక్షణ దినము పరుగిడిరమ్ము || ప్రేమ ||
6. తానే కడుగును తన రక్తముతో - తండ్రివలె నీ పాపమునంత తనయుడవై పోదు విపుడే - తనయుడవై పోదు విపుడే పరుగిడి రమ్ము || ప్రేమ ||
7. ప్రేమవార్త ప్రకటించబడె - ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము కృపాకాలమిదే జాగేల - కృపా కాలమిదే జాగేల పరుగిడి రమ్ము || ప్రేమ ||