#401Telugu Spiritual Song
Yesu prabhuve neeku rakshana nitcchunu
యేసుప్రభువే నీకు రక్షణ నిచ్చును - ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు
ప|| యేసుప్రభువే నీకు రక్షణ నిచ్చును - ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు
1. మృతియే పాపపు జీతము - ప్రభుని వరము జీవము
క్రీస్తు నంగీకరించిన - నిత్యజీవమిచ్చును
ప్రాణమున్ ఆ సిలువపై ని - బలిగా నిడి నిన్ కొనెగదా
మరతువా యేసుని ప్రేమకు - మరువకు || యేసు ||
2. కంటికి కనబడని వెన్నో - చెవికి వినబడినవెన్నో
గ్రహింప శక్యముకానివి - నీకై సిద్ధపరచెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
పెడచెవిన్ పెట్టకు యేసుని - మాటను || యేసు ||
3. మరణ బలము గలవానిన్ - నాశనంబు చేసెను
మరణభయములో నున్న - వారిని విడిపించెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
హృదయమున్ తెరువుము యేసును - చేర్చుకో || యేసు ||
4. సిలువ రక్తము చేతను - నిర్ధేవులైన వారిని
మధ్యపు గోడను పడగొట్టి - ఐక్యపరచే దేవునితో
ప్రాణమున్ ఆ సిలువపై ని - బలిగా నిడి నిన్ కొనెగదా
సమాధానపడు మిక దేవునితో ఈ క్షణమే || యేసు ||
5. దైవ స్వభావంబులో - పరిశుద్ధాత్మునియందు
పరలోకపు పిలుపులో - పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపై ని - బలిగా నిడి నిన్ కొనెగదా
పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగ - మొందుము || యేసు ||
6. దేవుని పరిశుద్ధతలో - కలుగబోవు మహిమలో
క్రీస్తుయేసు ప్రభువులో - పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
త్వరపడు నీదు భాగమును పొందను || యేసు ||
7. పరలోకములో కనబడు - తెల్లనైన వస్ర్తముల్
ధరించుకొను సమూహము - ఖర్జూరమట్టలు చేబూని
దేవునికిని గ్రొరెపిల్లకును - స్తోత్రములు చేయుచుండ
నీవు నీ రక్షణకై పాడుము - హల్లెలూయ || యేసు ||
