#402Telugu Spiritual Song
Viduvavu nannika ennadainanu -padipokundaa kaayu rakshakaa
విడువవు నన్నిక ఎన్నడైనను - పడిపోకుండా కాయురకక్షకా
ప|| విడువవు నన్నిక ఎన్నడైనను - పడిపోకుండా కాయురకక్షకా
పడిపోవు వారెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభూ
1. ప్రభువా నీకవిధేయుడనై - పలుమారులు పడుసమయములో
ప్రేమతో జాలి దీన స్వరముతో - ప్రియుడా నను పైకెత్తితివి || విడువవు ||
2. ఆదాము హవ్వలు ఏదేనులో ఆశతో ఆజ్ఞమీరినను
సిలువకు ఛాయగ బలి నర్పించి - ప్రియముగా విమోచించితివి || విడువవు ||
3. మోషేకు నీ దర్శనమిచ్చి - నీ ప్రజలను నడిపించుటకై
సాకులు చెప్పిన విడువక తననే - నాయకునిగ నియమించితివి || విడువవు ||
4. స్వంత తలంపున దావీదు - మందసమును తెచ్చునపుడు
ఉజ్జా మరణముచే దావీదు - హృదయమును కదిలించితివి || విడువవు ||
5. నీ మాటలు వినక యోనా - తర్షీషుకు తరలినపుడు
సముద్రములో మునుగుచుండగ - చేప ద్వారా దరిచేర్చితివి || విడువవు ||
6. నిన్నెన్నడు యెడబాయనని - నిక్కముగ పేతురు పలికె
ముమ్మారు బొంకినను విడువక - ప్రేమతోను రక్షించితివి || విడువవు ||
7. మా శక్తియు మా భక్తియు కాదు - ఇలలో జీవించుట ప్రభువా
కొల్లగ నీ యాత్మను నొసగితివి - హల్లెలూయ పాడెదను || విడువవు ||
