#403Telugu Spiritual Song
Dayagala Yesu paapi kaashrayudaa
దయగలయేసు పాపికాశ్రయుడా - ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము
ప|| దయగలయేసు పాపికాశ్రయుడా - ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము
1. ఓ ప్రభూ నీకు విరోధముగా - పాపము చేసిన దురితుండను
నీచుడనై నిన్ను వేధించితిన్ - ఓ నాథా పాపిని క్షమించుము || దయ ||
2. లోకాశలన్నియు శోధించగా - నా కాయమంతయు క్షీణించెను
నా కాశ్రయంబు నీవే ప్రభూ - ఓ నాథా పాపిని మన్నించుము || దయ ||
3. నా ధనము ఘనము నా సర్వము - నా దేవా పాపముకై వ్యయపరచితిన్
ఓ దేవా నేను రిక్తుండను - నా దురితంబులను బాపుమా || దయ ||
4. అందరు నాకు బంధువులని - ఎందరో స్నేహంబు చేసిరి
అందరు నన్ను విడువంగను - నా తండ్రీ నా కాశ్రయంబిమ్ము || దయ ||
5. మరుగైన నాదు పాపంబులకు - నరకంబు నాకు సరియైనది
నీ రక్తముతో కడుగుమా మరి - నాకు దిక్కెవరు ఓ యేసువా || దయ ||
6. ఈనాడే నీ మాట నేవిందును - ఎన్నడు నిన్ను విడువను
ఈనాడే నన్ను క్షమించుము - నా పేరు గ్రంథమందు ్రవాయుము || దయ ||
