18px
#404Telugu Spiritual Song

Siyonu vaasu laaraa

సీయోను వాసులారా

ప|| సీయోను వాసులారా
అ.ప. సకల వాగ్దానములు మనవాయెను - సాగిలపడి యేసుని ఆరాధించెదము
1. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో - దాని నివాసులుగా మనలను దీవించెన్ || సీయో ||
2. సంతోషించుము దేశమ భయపడవలదు గంతులు వేయుము ఘనకార్యములను చేయున్ || సీయో ||
3. పచ్చిక మొలచును ఫలియించును మరి తరులు ఫలియించును ద్రాక్ష అంజూరపు చెట్లు || సీయో ||
4. తొకరి కడవరి వర్షము విస్తారముగా - తనదు నీతిని బట్టి మనకొసగును || సీయో ||
5. కొట్టు ధాన్యముతో నిండి పొర్లును - క్రొత్త్తతైలము ద్రాక్షరసము పారును || సీయో ||
6. పసరు గొంగళి చీడపురుగులు మిడుతల్ - నాశనము చేసిన పంటను మీ కొసగును
7. సర్వశరీరులపై తన ఆత్మను పోసి - స్వప్నముల దర్శనముల మీ కొసగును || సీయో ||
8. సీయోను వాసులు సిగ్గునొందరు - శేషము నిలిచి వాసము చేతురు ప్రభులో || సీయో ||
9. ఆ దినమున యెహోవా నామమునందు - ప్రార్థించువారు రక్షణ నొందెదరు || సీయో ||