#405Telugu Spiritual Song
Gorrepilla vivaahotsava samayamu- vachchenu randi
గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి
ప|| గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి
1. సర్వాధికారియు - సర్వోన్నతుండైన
మన తండ్రిని ఘనపరచి - మన ముత్సహించెదము || గొర్రె ||
2. సిద్ధపడెను వధువు - సుప్రకాశముగల
నిర్మల వస్ర్తములతో - నలంకరించు కొనెన్ || గొర్రె ||
3. పరిశుద్ధుల నీతి - క్రియలే యా వస్ర్తములు
గొర్రెపిల్ల రక్తములో శుద్ధినొదిన వారు || గొర్రె ||
4. తెల్లని గ్రురముపై కూర్చండినవాడు
నమ్మకమై యున్నట్టి - పెండ్లి కుమారుండు || గొర్రె ||
5. దేవుని వాక్యమను - నామముగలవాడు
రక్తములో ముంచిన - వస్ర్తమున్ ధరియించె || గొర్రె ||
6. ప్రేమించి సంఘముకై - ప్రాణంబునిడె ప్రభువు
పరిశుద్ధపరచుట కొరకై - తానప్పగించుకొనెన్ || గొర్రె ||
7. శ్రీయేసుక్రీస్తుండె - సంఘంబునకు శిరస్సు
వాక్య ఉదయకముతోడ - శుద్ధిపరచుచుండె || గొర్రె ||
