#406Telugu Spiritual Song
Nirmimpabaditimi manamu daivagruhamugaa
నిర్మింపబడితిమి మనము దైవగృహముగా - తన కృపచే స్థిరపరచబడితిమి
ప|| నిర్మింపబడితిమి మనము దైవగృహముగా - తన కృపచే స్థిరపరచబడితిమి
1. కార్చెను యేసురక్తము మనకై - కూర్చెను సంఘముగా
కృతజ్ఞతలు చెల్లించెదము - మన ప్రభు యేసునకే || నిర్మింప||
2. పరిశుద్ధుల సహవాసమునిచ్చి - పరలోకమునిచ్చే
పూజనీయుని పూజించెదము - మనసార మనము || నిర్మింప||
3. పరదేశులమైయున్న మనల - తన ఇంటికి జేర్చె
ప్రాపుగ మనము ప్రస్తుతింతుము - భక్తపాలకుని || నిర్మింప||
4. తన కార్యమును మనలో జేసి - తన సేవకు పిలిచె
తనవి దీరగ స్తుతులర్పింతము - వినయముగా మనము || నిర్మింప||
5. సంఘంబునకు శిరస్సైయున్న - శ్రీయేసు ప్రభువే
సర్వకాలము జయశబ్దముతో - సన్నుతించెదము || నిర్మింప||
