18px
#407Telugu Spiritual Song

Kristesu prabhuvu thana rakhtamichchi

క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున

ప|| క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున యెవరు చేరెదరో వారె ధన్యులు పరలోకమే వారిది
1. అపొస్తలుల బోధను నమ్మి - స్థిరపరచబడినవారే ఆత్మశక్తితో వారు యెల్లపుడు - సంఘములో నిలిచెదరు || క్రీస్తేసు ||
2. పరిశుద్ధులతో సహవాసమును - ఎవరు కలిగియుందురో వారే పొందెదరు క్షేమాభివృద్ధి - క్రీస్తేసు ప్రభువునందు || క్రీస్తేసు ||
3. ప్రభుదేహ రక్తమును తిని త్రాగువారే - తనయందు నిలిచెదరు ప్రకటించెదరు ఆయన మరణ - పునరుత్థానమును వారు || క్రీస్తేసు ||
4. పట్టువదలక సంఘముతో కూడి - ఎవరు ప్రార్థించెదరో ప్రార్థన ద్వారా సాతాను క్రియలు - బంధించెదరు వారె || క్రీస్తేసు ||
5. క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు - ఎవరెదురు చూచెదరో నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు - సర్వలోకమునందు || క్రీస్తేసు ||