#408Telugu Spiritual Song
Dhanyudavu neevu dhanyudavu- O israyelu bahu dhanyudavu
ధన్యుడవు నీవు ధన్యుడవు - ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు
ప|| ధన్యుడవు నీవు ధన్యుడవు - ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు
యెహోవాయే నిన్ను విమోచించెను - ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడవు ధన్యుడవు
1. నీ పాపము పరిహారమాయె - నీ యతిక్రమము తుడువబడెన్
నిర్దోషియని నిన్నెంచె ప్రభు - ఆత్మలో కపటము లేదనెను || ధన్యు ||
2. ఏర్పరచబడిన ధన్యుడవు - దరిజేరితివి నీ ప్రభుకడకు
చేర్చెను తన మందిరములోన తృప్తిపరచె - దాని సమృద్ధిచే || ధన్యు ||
3. దుష్టుల యోచనలో వెళ్లక - పాపుల మార్గమున నిలువక
అపహాసకులతో కూర్చుండక - ధర్మశాస్ర్తము ధ్యానించు నీవు || ధన్యు ||
4. ప్రభునిచే నీవు బలమొంది - ప్రభుమార్గము నీయందుండి
జలములలో నీవు నడచుచు - జలమయముగా చేయునీవు || ధన్యు ||
5. యెహోవాయే ఉత్తముడని - రుచిచూచి మరి ప్రభు నెరిగి
మహోన్నతుని ఆశ్రయించి - ఆరాధించు నీవు ధన్యుడవు || ధన్యు ||
