18px
#409Telugu Spiritual Song

Nootana aakaashamu bhoomi nenu joochiti

నూతన ఆకాశమును భూమి నేను జూచితి

ప|| నూతన ఆకాశమును భూమి నేను జూచితి అందుండె శాంతి ఆనందజ్యోతి మహిమ తేజముల్ ముందున్న భూమి యాకాశము లదృశ్యమాయెను సముద్ర మికను లేదు అందున్న వెల్లను
1. పరలోక రాజ్య పట్టణమెంతో యద్భుతము - గొర్రెపిల్ల కాంతితోడ దాని కాంతి యెంతయో సురక్షితంబు చేయబడెను ప్రాకారంబుతో - గొర్రెపిల్లకు యుగములందు స్తుతియారాధన
2. పరిశుద్ధ యెరూషలేము పరలోకమునుండి - దేవుని యొద్దనుండి దిగుట నేను చూచితి భర్త కొరకు అలంకరింపబడియున్న - పెండ్లి కుమార్తెవలెనె సిద్ధమై యుండెను || నూ ||
3. సింహాసనము నుండి యొక్క స్వరము వింటిని - దేవుని నివాసము మనుజులలో నున్నది ఆయన వారితోడనే ఎల్లప్పుడుండును - ఆయన వారి దేవుడు వారాయన ప్రజలు || నూ ||
4. దేవుడు వారి కండ్లనీళ్లు తుడిచివేయును - దుఃఖంబు మరణములు యింకెన్నడుండవు ఏడ్పు బాధ శాపము లిక నెన్నడుండవు - రాత్రి లేదిక గొర్రెపిల్ల దీపంబాయెగా || నూ ||
5. సింహాసనాసీనుండు తానే మరల చెప్పెను - ఇదిగో సమస్తమును నూతనమాయెను పాతసంగతులెల్లను గతించిపోయెను - గతించినవి రావు మరల జ్ఞాపకమునకు || నూ ||
6. పట్టణమునకు ఎత్తైన ప్రాకారమున్నది - చుట్టుపండ్రెండు గుమ్మములు దానికున్నవి కట్టబడెను ముత్యములతో పునాదులు - చుట్టబడెను సూర్యకాంత సువర్ణములతో || నూ ||
7. పట్టణపు పునాదులు ప్రశస్తమైనవి - సూర్యకాంతము నీలము యమున పచ్చయు వైఢూర్యకెంపు స్వర్ణరత్న గోమేధికము - పుష్య పద్మరాగ స్వర్ణసునీయ సుగంధము || నూ ||
8. జయించువారు ధన్యులు యేలుదురెన్నడు - ధరించి తెల్ల వస్ర్తములు సంతసింతురు ప్రభువు వారి - దేవుడై యుండు నిరంతము - వారసులై సర్వము స్వతంత్రించుకొందురు
9. ప్రభుని భక్తులారా మీరు సిద్ధపడుడి - అద్భుత రాజ్యమందు నుండ యాశపడుడి గొర్రెపిల్ల గ్రంథమున పేరున్న వారలు - ఘనంబుగ పరంబున ప్రవేశించెదరు || నూ ||