#410Telugu Spiritual Song
Prabhuvaa nee paripoornatha nundi
ప్రభువా నీ పరిపూర్ణత నుండి - పొందితిమి కృప వెంబడి కృపను
ప|| ప్రభువా నీ పరిపూర్ణత నుండి - పొందితిమి కృప వెంబడి కృపను
1. ప్రభువైన యేసుక్రీస్తు - పరలోక విషయములో
ప్రతి ఆశీర్వాదమును - ప్రసాదించితివి మాకు || ప్రభు ||
2. జనకా నీ వెన్నుకొనిన - జనుల క్షేమము జూచి
సంతోషించునట్లు - నను జ్ఞాపకముంచుకొనుము || ప్రభు ||
3. నీదు స్వాస్థ్యమైనట్టి - నీ ప్రజలతో కలసి
కొనియాడునట్లుగా - నను జ్ఞాపకముంచుకొనుము || ప్రభు ||
4. దేవా నీ ప్రజల యెడల - దిన దినము నీకున్న
ఘనుడా నీదు దయతో - నను జ్ఞాపకముంచుకొనుము || ప్రభు ||
5. దేవా నీదు స్వరూప - దివ్యదర్శనమును
దినదినము నా కొసగి - నను జ్ఞాపకముంచుకొనుము || ప్రభు ||
6. మీ మధ్యన నా ఆత్మ - ఉన్నది భయపడకు
డనిన మహోన్నతుడా - నను జ్ఞాపకముంచుకొనుము || ప్రభు ||
7. ముదమార నన్నెన్నుకొని - ముద్రయుంగరముగను
చేతుననిన ప్రభువా - నను జ్ఞాపకముంచుకొనుము || ప్రభు ||
8. కృపాసత్య సమ్మిళిత - సంపూర్ణ స్వరూప
హల్లెలూయా నీకే ప్రభో - ఎల్లప్పుడు కలుగుగాక || ప్రభు ||
