18px
#412Telugu Spiritual Song

Prakaashamaina aashcharya deshamu

ప్రకాశమైన అశ్చర్యదేశము - ప్రియుని దేశము - నా ప్రియ దేశము

ప|| ప్రకాశమైన అశ్చర్యదేశము - ప్రియుని దేశము - నా ప్రియ దేశము
1. పాదరహిత దేశము ఏ శాపము కనబడదు నిత్యానందము ఆగని గీతము - ఆకాశమందు హోసన్న హల్లెలూయ || ప్రకాశ ||
2. సూర్యచంద్రులు లేరు కాని చీకటి కనబడదు దైవ కుమారుడు తేజోమయుడు - నిత్యము వెలుగిచ్చును పగల...ప్పుడు || ప్రకాశ ||
3. పలువిధ బోధలతోనుండు గుంపుల పేరుండదు యేక కుటుంబము ఒక నాయకుడే - ప్రమామయ దేశము ప్రియులు వెళ్లు || ప్రకాశ ||
4. ప్రశ్నలు యేవుండవు ఎట్టి కలవరమే వుండదు జాతి, రంగు, భాషభేదము - కలవారెవరు లేరు ప్రేమే పల్కున్ || ప్రకాశ ||
5. పలువిధ ప్రణాళికలు పరిపాలించు చట్టములు చెరసాలలును శిక్షయులేదు - నరుల పరిపాలన అందుండదు || ప్రకాశ ||
6. సంత వీధులు లేవు కర్మాగారములే లేవు ధనికులు దరిద్రులు చిన్నలు పెద్దలు - అను భేదము లేదు అందరు సమం || ప్రకాశ ||
7. యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువు ఈ గొప్పధన్యత పోగొట్టుకొనువా - రెవరును కావలదు నేడేరమ్ము || ప్రకాశ ||