18px
#413Telugu Spiritual Song

Anaadi devudu aashrayamu-thana baahuvulu nee kaadhaarame

అనాది దేవుడు ఆశ్రయము - తన బాహువులు నీ కాధారమే

ప|| అనాది దేవుడు ఆశ్రయము - తన బాహువులు నీ కాధారమే
అ.ప. నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు మరణము వరకు మమ్ము నడిపించును
1. కరుణతోనే ఆకర్షించే శుద్ధ దివ్య ప్రేమ ఈ అరణ్యములో ఆశచూపి నీకు - బ్రతిమాలుచు నిన్ను పిలిచెన్ || నిత్యమైన ||
2. అంధకార మార్గమందు శుద్ధ దివ్యజ్యోతి దుఃఖపూరితమగు లోయలన్నిటిని - నీటి యూటలుగా మార్చెన్ || నిత్యమైన ||
3. కృపను చూపి మనస్సు కరిగే శుద్ధ దివ్యప్రేమ నీదు సమాధానమనుబంధమును - నిక్కముగ ప్రభువే కాయును || నిత్యమైన ||
4. ఈ భువిన్ నీవు గడుపు యాత్ర ప్రభువు దయ వలనే కారడవియైనన్ - ప్రభు రొమ్ముననే - దొరకును నెమ్మది నీకు || నిత్యమైన ||
5. ఎండిన జీవితము - చిగురించినదే దైవ కృపవలనే శాశ్వతానందము శిరముపై వెలయున్ - దుఃఖము నిట్టూర్పులు పోవున్ || నిత్యమైన ||
6. సంతసముతో తిరిగిరమ్ము దైవబలముచే సీయోను కొండకాయన నిన్ను చేర్చును - శాశ్వతానంద మొందెదవు || నిత్యమైన ||