18px
#414Telugu Spiritual Song

Yesuni vaaghdaanamul - gnaapakamu Nandunchukoni

యేసుని వాగ్దానముల్ - జ్ఞాపకమునందుంచుకొని

ప|| యేసుని వాగ్దానముల్ - జ్ఞాపకమునందుంచుకొని తుఫాను వీచిన శ్రమలున్న - నీ చాటున నేనుండెద
1. ద్వేషము ఈర్ష ్యలోకములో - అత్యధిక ప్రేమ నీలో అంధకారపు లోకములో - నీవే దివ్యజ్యోతివి అంధకార పాపమందు - నీవే సత్యమార్గము భరియింపరాని మరణపు బాధలో - నీవే సత్యదేవుడవు || యేసుని ||
2. శక్తిహీనుడనైయుంటి - నీవే నాదు సహాయుడవు కృంగియున్న సమయములో - తండ్రిగ కౌగిట చేర్చితివి నిత్యజీవిత వసరములను - తీర్చువాడవు నీవేగా బాధలోహింస శ్రమలయందు - నిత్యము ఆనందింతును || యేసుని ||
3. జగమున యుద్ధ కలహములు - శాంతిలేనే లేదెచట యేసుప్రభువా నీ ద్వారా - ఆనందభరితుడనైతిని ఘోరమౌ తుఫాను లేవ - హృదయము కంపించెను భీతిన్ భయపడకుడని ప్రభువే పల్క - నిమ్మళించెను తుఫాను || యేసుని ||