18px
#415Telugu Spiritual Song

Paravaasini ne jagamuna prabhuvaa

పరవాసిని నే జగమున ప్రభువా - నడచుచున్నాను నా

ప|| పరవాసిని నే జగమున ప్రభువా - నడచుచున్నాను నా దారిన్ నా గురి నీవే నా ప్రభువా - నీ దరి నే జేరెదను - నేను
1. లోకమంతా నాదని యెంచి - బంధుమిత్రులే ప్రియులనుకొంటిని అంతయు మోసమేగా - వ్యర్థము సర్వమును - ఇలలో || పరవాసిని ||
2. ధనసంపదలు గౌరవములు - దహించిపోవు నీలోకమున పాపమునిండె జగములో - శాపము చేకూర్చుకొనె - లోకము || పరవాసిని ||
3. తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు యెంతో తెలుపుము యెంత అల్పుడనో - విరిగి నలిగియున్నాను - నేను || పరవాసిని ||
4. ఆ దినము ప్రభు గుర్తెరిగితిని - నీ రక్తముచే మార్చబడితిని క్షమాపణ పొందితివనగా - మహానందము కలిగె - నాలో || పరవాసిని ||
5. యాత్రికుడ నే నీ లోకములో - సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగ - పొందితిని నేను - యేసునే || పరవాసిని ||
6. నా నేత్రములు మూయబడగ - నాదు యాత్ర ముగియునిలలో చేరుదున్ పరలోకదేశము - నాదు గానము యిదియే - నిత్యము || పరవాసిని ||