#416Telugu Spiritual Song
Prabhuva neeve nammakamaina saamardyudavu
ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు
ప|| ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు
ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడ
1. ఇహపరమందు నివసించువారు - నీ నామమున మోకరింతురు
మహిమపరతురు దేవుని - అంగీకరించు ప్రతివాని జిహ్వ నీవే క్రీస్తువనుచు || ప్రభు ||
2. అపారమైన క్రియలు చేయుచు - మమ్మెల్ల పరిపాలించుచున్నావు
ప్రేమగల ప్రభువా - పాపిని రక్షింప యిహమున - కరిగి గొప్ప రక్షణనిచ్చె || ప్రభు ||
3. ఐగుప్తు నుండి విడిపించినవారిని - నలువది వత్సరములు నడిపించితివి
కాచితివి కనుపాపగ - వుంచియున్నావు - మాదిరిగా వారిన్ నీ ఆలోచన గొప్పది || ప్రభు ||
4. పరమును తెరచి మన్నా కురిపించి - అందరికి జీవజలమిచ్చితివి
పొందిరి తృప్తినీయందు - అగ్నిస్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును || ప్రభు ||
5. తుఫానురేగి నిరాశపరచ శత్రువు - మా మధ్య చెలరేగగ మమ్ములను రక్షించితివి
వాగ్ధానములు నెరవేర్చి - నీవే స్వాస్థ్యము నిచ్చితివి || ప్రభు ||
