18px
#418Telugu Spiritual Song

Unnantha durgamu – naa devude

ఉన్నతదుర్గము నా దేవుడే - నా రక్షకుడే నాకాశ్రయుడు

ప|| ఉన్నతదుర్గము నా దేవుడే - నా రక్షకుడే నాకాశ్రయుడు
1. యెహోవా మహాత్మ్యము ఎంతో గొప్పది - అధిక స్తోత్రములకు పాత్రుండాయనే ఆ ప్రభు ఐశ్వర్యము - గ్రహింపశక్యము కానిది || ఉన్నత ||
2. నా కోటయు నా శైలము ఆయనే - నా కేడెము రక్షణ శృంగమును ఉన్నతమగు దేవుడే - నాకాశ్రయ దుర్గము || ఉన్నత ||
3. నా ప్రియ ప్రభువు ధవళవర్ణుడు - రత్నవర్ణుడు నాకతిప్రియుడు పదివేల మందిలో - అతని గుర్తించెదను || ఉన్నత ||
4. నిత్యజీవము మెండుగ నొసగి - పరమాహారము తృప్తిగ నిచ్చె నిరతము తన కృపతో - నిలుపుకొనెను స్తోత్రము || ఉన్నత ||
5. విజయగీతము పాడెద ప్రభుకే - విజయమునిచెదను - శత్రువుపైన ఉన్నత దుర్గముపై నెక్కించెను స్తోత్రము || ఉన్నత ||
6. మహిమ పూర్ణుడు నా ప్రభుయేసు - ఇహకేతెంచును నాకై త్వరలో హల్లెలూయ స్తోత్రముల్ పాడి ప్రహర్షింతును || ఉన్నత ||