18px
#419Telugu Spiritual Song

Yehovaa ye manakandariki - Ennio melula jesen

యెహోవాయే మనకందరికి - ఎన్నియో మేలుల జేసెన్

ప|| యెహోవాయే మనకందరికి - ఎన్నియో మేలుల జేసెన్ తన కృప కనికరముల్ స్మరియించి స్తుతించెదము
1. మనమాయన జనము ఆయన సంతతియు సిలువ మరణము ద్వారా మనకు తనదు జీవమునిచ్చె ఎంత అద్భుత రక్షకుడు || యెహోవా ||
2. అడుగువాటికంటె అధికముగ నిచ్చె - తన నిబంధనను స్థిరపరచి తన వాక్కులు నెరవేర్చె మాట తప్పనివాడవు || యెహోవా ||
3. కష్టదుఃఖములందు పాలివాడాయె - ప్రేమనుజూపి ప్రభువే మనల తన రెక్కలపైమోసె మనతో నుండును నిరతము || యెహోవా ||
4. ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితిమి - అయినను ప్రభువే తన దయజూపి మనలన్ క్షమియించెనుగా - ప్రేమగల మా తండ్రివి || యెహోవా ||
5. నీవే మా దుర్గమును కేడెము నీవే - నిన్ను మేము నమ్మియున్నాము మాకు సర్వము నీవే మేము నీదు ప్రజలము || యెహోవా ||