18px
#420Telugu Spiritual Song

Priya yesu raajunu ne choochina chaalu

ప్రియయేసు రాజును నే చూచిన చాలు - మహిమలో నేనాయనతో నుంటేచాలు

ప|| ప్రియయేసు రాజును నే చూచిన చాలు - మహిమలో నేనాయనతో నుంటేచాలు నిత్యమైన మోక్షగృహమునందు చేరి - భక్తుల గుంపులో హర్షించిన చాలు
1. యేసుని రక్తమందు కడుగబడి - వాక్యముచే నిత్యం భద్రపరచబడి నిష్కళంక పరిశుద్ధులతో పేదన్ నేను - బంగారు వీధులలో తిరిగెదను || ప్రియ ||
2. దూతలు వీణలను మీటునపుడు - గంభీర జయధ్వనులు మ్రోగునపుడు హల్లెలూయ పాటలు పాడుచుండ - ప్రియ యేసుతోను నేను యుల్లసింతున్ || ప్రియ ||
3. ముండ్ల మకుటంబైన తలను జూచి - స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్ కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి - ప్రతియొక్క గాయమును ముద్దాడెదన్ || ప్రియ ||
4. హృదయము స్తుతులతో నింపబడె - నా భాగ్య గృహమును స్మరించుచుంటే హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ - వర్ణింప నా నాలుక చాలదయ్యా || ప్రియ ||
5. ఆహా యా బూర యెపుడు ధ్వనించునో - ఆహా నా యాశయెపుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునెపుడో - ఆశతో వేచియుండె నా హృదయం || ప్రియ ||