18px
#421Telugu Spiritual Song

Prabhoo nee vaadanu neevu - naa prabhudavani

ప్రభూ నీవాడను నీవు నా ప్రభుడవని - నీ కొరకై జీవింతును

ప|| ప్రభూ నీవాడను నీవు నా ప్రభుడవని - నీ కొరకై జీవింతును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను
1. ప్రభువా యెరిగితిని లోకమంత మోసమని - చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో కృతజ్ఞత కలిగి (2) - నీవైపే చూచెదను నీయందే నిలిచియుండి నీ యాజ్ఞల పాలింతును || ప్రభూ ||
2. నా ముందు నడిచే ప్రభూ నిన్ను వెంబడించెదను నీవు నాతోడనుండ మరచెదను దుఃఖమును నెమ్మదిని పొంది యిల (2) కన్నీరు - కార్చనిక నీవే నా సర్వమని నీయందే బలపడెద || ప్రభూ ||
3. యేసుని సిలువజూచి విజయమును పొందెదను సహింతును సంతసముగ నీ కొరకు అన్నింటిని నిన్ను నే నమ్మెదను - (2) నీతోనే సాగెదను నీ రెక్కల చాటు నేనుండ భయపడను || ప్రభూ ||
4. మరణనది యొద్దకు సంతసముగ వచ్చెదను మృత్యువు బారినుండి జీవమునకు దాటింతువు రక్షకుని చూచెదను (2) - నన్నాయన చేర్చుకొనున్ తక్షణమే తన రూపమునకు మార్పుచెందెదను || ప్రభూ ||
5. అగమ్య జ్యోతియందు ఘనముగ నే ప్రవేశించి దూతలు, పరిశుద్ధులు, భక్తులనే చూచెదను నే సంతసించెదను (2) - ప్రభువుతోడ నుండెదను నిరీక్షణ యిదియే ఆయనతో నేనుందును || ప్రభూ ||