#422Telugu Spiritual Song
Paralokamu naa deshamu –
పరలోకము నా దేశము - పరదేశి నేనిల
ప|| పరలోకము నా దేశము - పరదేశి నేనిల
మాయలోకమేగా - నేను యాత్రికుడను
1. ఎంతో అందమైనది పరలోకము - అసమానమైనది నా దేశము
ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును || పర ||
2. దూతలు పాడుచుందురు - పరమందున దివారాత్రములందు పాడుచుందురు
పావనుని చూచి నేను హర్షింతును నిత్యము || పర ||
3. రక్షకుని చెంతకు యెప్పుడేగెదను - వీక్షించెదనెప్పుడు నాదు ప్రియుని
కాంక్షించెద నామదిలో - ఆయన చెంతనుండ || పర ||
4. అద్దరికి ఎప్పుడు నేను వెళ్లేదన్ - అగుపడు చున్నది గమ్యస్థానము
అచ్చటనే చూచెదను - పరిశుద్ధులెల్లరిన్ || పర ||
5. నిత్యానంద ముండును పరమందున - నీతి సమాధానము ఉండునచ్చట
పొందెదను విశ్రాంతిని - శ్రమలన్నియు వీడి || పర ||
