#423Telugu Spiritual Song
Eduru choochedamu dhruda punaadi gala
ఎదురుచూచెదము దృఢపునాదిగల పట్టణమునకై
ప|| ఎదురుచూచెదము దృఢపునాదిగల పట్టణమునకై
దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు - మన ముల్లసించెదము
1. ఆ నగరములో ప్రభుమహానీయుడు - స్తుతులకు పాత్రుడుతానే
దేవుడా పట్టణమందున గలడు - కదలదు ఎన్నటికిన్ || ఎదురు ||
2. దృఢముగానున్న దేవుని నగరుకు - చుట్టు ప్రాకారము గలదు
తన సింహాసనమందున గలడు - రాజాధి రాజాయనే || ఎదురు ||
3. ప్రభు పట్టణమున నిత్యసంతోష - శాంతి విజయములు గలవు
నీతిమంతులు సదాస్తుతులు పాడెదరు - ప్రభువారితోడనుండ || ఎదురు ||
4. జయవంతులందరు ఆ నగరమున - నిత్యము నివసించెదరు
భూమి పునాదులు వేయకమునుపే - వారికై సిద్ధపరచెన్ || ఎవరు ||
5. ప్రభు పట్టణము ప్రియమైనదియు - పరిశుద్ధముగా నుండు
వెళ్లగోరినచో యేసుని నమ్మి - రక్షణ పొందుము || ఎవరు ||
