#424Telugu Spiritual Song
Nee siluve naaku sharanu Yesu prabho
నీ సిలువే నాకు శరణు యేసు ప్రభో!
ప|| నీ సిలువే నాకు శరణు యేసు ప్రభో!
1. దురితదూరుడా నీదరి జేరగ నాదు పాప
శాపము దీర్చి దరిజేర్చితివి కృపతో || నీ ||
2. శాశ్వతముగ నన్ను - ప్రేమించితివి - నీదు
ప్రేమకు నేనే సాక్షిని - బలమగు నీదు కృపతో || నీ ||
3. నా హృదయములో భారములెల్లను
సిలువను జూడగ సమసిపోయెను - శక్తిగల నీ కృపతో || నీ ||
4. రక్తముకార్చి మరణము గెల్చి - శత్రు సైతానను
ఓడించి - విజయమిచ్చితివి కృపతో || నీ ||
5. నీవు పొందిన బాధలవలన నిత్యసుఖంబులు
సంపూర్ణముగ పొందితి నీదు కృపతో || నీ ||
6. యేసు నా సిలువను నే మోసి ఇలలో నిన్ను
వెంబడించుటకు - ధైర్యమిచ్చితివి కృపతో || నీ ||
7. నీ రాకడకై - నిరీక్షించి నిత్యకృపను నే
పొందితినంచు పాడెదను హల్లెలూయ || నీ ||
