18px
#425Telugu Spiritual Song

Naa sarvamaina prabhoo-Arpinchukondu neekai

నా సర్వమైన ప్రభూ - అర్పించుకొందు నీకై

ప|| నా సర్వమైన ప్రభూ - అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే - నీ సేవ చేయుటకై
1. ఆత్మప్రాణ దేహము - తలంపులు క్రియలు - అన్నియు నీ కొరకే గైకొనుము ఓ యేసువా - జీవించగోరితి నీ కొరకే - నీకే మహిమ ఘనత || నా ||
2. వెలిగించు నా జీవము - నింపుము నీ ప్రేమతో - నీ కృపతో నడిచెదను మెండైన నీ శక్తితో - ఘనపరచగోరితిని నీ నామమును - నీకే మహిమ ఘనత || నా ||
3. నా కాళ్లు చేతులెల్ల - నీ సేవ కర్పింతును - నా నాలుక నిత్యము-నిన్ను స్తుతింపనిమ్ము మనస్సార ప్రేమింతు నిను ప్రభువా - నీకే మహిమ ఘనత || నా ||