18px
#426Telugu Spiritual Song

Manaku jeevamaiyunna rakshakudu prabhu Yese

మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే

ప|| మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే
1. దేవుని దీవెనలు పొంద - యౌవనులారా యేసుని సన్నిధికి రారండి దైవకుమారుడు పావన క్రీస్తుని జీవము పొంది నడువుడి || మనకు ||
2. యేసు నంగీకరించెడి వారి పేరులు - జీవగ్రంథమునందు ్రవాయబడున్ నమ్మకమైయున్న పావన క్రీస్తుని - జీవముపొంది నడువుడి || మనకు ||
3. దేవుని స్వరూపము కల్గిన యేసుప్రభు - మనుజ రూపంబున జన్మించెను చావును గెల్చిన పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి || మనకు ||
4. యేసురక్తములో కడుగబడిన - తెల్లని వస్ర్తముల్ ధరియించి రారండి గొప్ప కృపానిధి పావన క్రీస్తుని - జీవముపొంది నడువుడి || మనకు ||
5. క్రీస్తుయేసుని యౌవనజనమా - ఆయనకు ప్రాణములర్పించను నిలువుడి సత్యరూపియగు పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి || మనకు ||
6. రాజుల రాజు ప్రభుల ప్రభువు అను పేరు - ఆయన వస్ర్తముపై ్రవాయబడెన్ సర్వశక్తిగల పావనక్రీస్తు - జీవము నొంది నడువుడి || మనకు ||
7. ప్రభుని పిలుపు పొందియున్న - యౌవనులారా విశ్వసించి విజయము పొందుడి శత్రువు నోడించి యేసు నామమున - హల్లెలూయ పాట పాడుడి || మనకు ||