18px
#427Telugu Spiritual Song

Nee devuni sannidini kanabadanu - neevu siddapaduma

నీ దేవుని సన్నిధిని - కనబడను నీవు సిద్ధపడుమా

ప|| నీ దేవుని సన్నిధిని - కనబడను నీవు సిద్ధపడుమా
1. నీ యౌవనములో నీ హృదయమును - సంతృప్తిగా నుండనిమ్ము అయితే వీటిని బట్టి దేవుడు - తీర్పులోనికి తెచ్చు నిన్ను || నీ దేవుని ||
2. దుర్దినంబులు రాకముందే - వాటిలో సంతోషము లేదని చెప్పు సమయము రాకమునుపే - సృష్టికర్తను స్మరియించుమా || నీ దేవుని ||
3. నీ యౌవన జీవితమునుబట్టి - తృణీకారము నొందకుమా ప్రభువును బోలి నడుచుకొనుమా - మాదిరి కరముగ జీవించుమా || నీ దేవుని ||
4. వినయ విధేయత కలిగియుండి - ఒకరినొకరు యోగ్యులుగా మన్నన చేయుచు పరుల కార్యముల - స్వకార్యముల వలె భావించుమా || నీ దేవుని ||
5. ప్రేమ సంతోష సమాధానము - దీర్ఘశాంత దయాళుత్వము మంచితనము సాత్వీక విశ్వాసము - కలిగియుండి జీవించుమా || నీ దేవుని ||
6. మేలుచేయుటయందు నీవు - విసుగక యుండుము యెల్లప్పుడు సహనముతో ప్రభుసేవ చేసిన - ఫలము ననుభవించెదవు || నీ దేవుని ||
7. హల్లెలూయ పాటలు పాడుచు - ఎల్లప్పుడు ప్రభు రాకడకై ఉల్లమునందు సంతసించుచు - పాడుము ప్రభునకు హల్లెలూయ || నీ దేవుని ||