18px
#428Telugu Spiritual Song

Siluve nee gurigaa – naduvu yavvanudaa

సిలువే నీ గురిగా - నడువు యౌవనుడా

ప|| సిలువే నీ గురిగా - నడువు యౌవనుడా వెనుకంజ వేయకయే - నిలువు యేసుబండపై
1. మునుగుచుండె - నీ జీవనావ దాటించువారెవ్వరు? యేసుప్రభుండే - దాటించువాడు నీదు చుక్కాని యేసే || సిలువే ||
2. వచ్చెను యేసు - ఈ లోకమునకు తెచ్చె నీకు రక్షణ అక్షయుడు తెరచె - నిశ్చయముగ మోక్షద్వారము నీకే || సిలువే ||
3. సిలువలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను విమోచించును విశ్వసించిన - ముక్తిని పొందెదవు || సిలువే ||
4. ప్రేమవార్త ప్రకటింపబడెను ప్రియులారా రండి నేడే మీ ఉల్లములకు ప్రియమైన యేసే శాంతినిచ్చెడి రాజు || సిలువే ||