18px
#429Telugu Spiritual Song

Asamanundagu oh kristu - adhvitheeyundagu devaa

అసమానుండగు ఓ క్రీస్తు - అద్వితీయుండగు దేవా

ప|| అసమానుండగు ఓ క్రీస్తు - అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగ (2) - నీవే ప్రభువా (2)
1. ఇహపరములలో నీ జన్మ - మహానందము కలిగించె (2) అభయము నిచ్చి మాకు - భయభీతిని బాపితివి (2) || అస ||
2. నీ జీవిత వాక్కులన్ని - సజీవము జనులందరికి పావనుడా ప్రభుయేసు - అవనికి మాదిరి నీవే || అస ||
3. మరణము గెల్చిన మా ప్రభువా - పరమ దేవుడవు నీవే సాతానున్ ఓడించి - నీతిగా మము తీర్చితివి || అస ||
4. పాపశాపముల బాపితివే చూపితివే పరమదారి శక్తిగల ఓ ప్రభువా - నీకే మా స్తోత్రములు || అస ||
5. విశ్వమంతట ఓ దేవా - శాశ్వతమైనది నీ ప్రేమ జ్ఞానమునకు మించినది - ఉన్నతమైన ప్రేమ || అస ||
6. సంఘమునకు శిరస్సు నీవే - అంగములుగ మము జేసితివి సర్వ సంపూర్ణుండా - సర్వ మహిమ నీకే || అస ||