18px
#430Telugu Spiritual Song

Stutiyu mahima ghanatha neeke yuga yugamula

స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల

ప|| స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా(2)
1. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము(2) మేమందరము ఉత్సహించి సంతోషించెదము(2) కొనియాడెదము మరువబడని మేలుల జేసెనని || స్తుతి ||
2. నీ ఒక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము || స్తుతి ||
3. నూతనముగ దినదినము నిలుచు నీదు వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్ర"తితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్యప్రభువా || స్తుతి ||
4. నీవే మాకు పరమప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా నడిపించెదవు సమభూమిగల ప్రదేశములో నన్ను || స్తుతి ||
5. భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్ని మా కొరకు మరణము గెల్చి ఓడించితివి - సాతాను బలమున్ పరమునుండి మాకై వచ్చే ప్రభుయేసు జయము || స్తుతి ||