18px
#431Telugu Spiritual Song

Ponditini nenu prabhuva nee nundi

పొందితిని నేను ప్రభువా నీ నుండి - ప్రతి శ్రేషష్ఠ ఈవిని ఈ భువియందు

ప|| పొందితిని నేను ప్రభువా నీ నుండి - ప్రతి శ్రేషష్ఠ ఈవిని ఈ భువియందు
1. జీవితయాత్రలోసాగి వచ్చితిని - ఇంతవరకు నాకుతోడైయుండి ఎబినేజరువైయున్న ఓ యేసుప్రభువా - నా రక్షణ కర్తవు నీవైతివి || పొంది ||
2. గాలి తుఫానులలో నుండి వచ్చితిని - అంధకారశక్తుల ప్రభావమునుండి నీ రెక్కల చాటున నను దాచితివయ్యా - నీవే ఆశ్రయ దుర్గంబైతివి || పొంది ||
3. కష్టదుఃఖంబులు నాకు కలుగగా - నను చేరదీసి ఓదార్చితివే భయభీతి నిరాశలయందున ప్రభువా - బహుగా ధైర్యంబు నా కొసగితివి || పొంది ||
4. నా దేహమందున ముల్లు నుంచితివి - సాతానుని దూతగా నలుగగొట్టన్ వ్యాధి బాధలు బలహీనతలందు - నీ కృపను నాకు దయచేసితివి || పొంది ||
5. నీ ప్రేమచేత ధన్యుడనైతిని - కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్టపరీక్షల యందున ప్రభువా - జయ జీవితము నాకు నేర్పించితివి || పొంది ||