#432Telugu Spiritual Song
Pooja neeyudesu prabhu palu nindala
పూజనీయుడేసుప్రభు పలునిందలు నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు
ప|| పూజనీయుడేసుప్రభు పలునిందలు నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు
1. నీ స్వకీయులే నిందించిన - నిన్నంగీకరించకపోయిన
ఎన్నో బాధలొందితివా నాకై - సన్నుతింతును నీ ప్రేమకై || పూజ ||
2. సత్యము మార్గము మరి జీవమై - నిత్యజీవమియ్యను వచ్చితివి
వంచకుడవని నిన్ను నిందించిర - ఓ దయామయ నజరేయుడ || పూజ ||
3. యూదాగోత్రపు ఓ సింహమా - ఆద్యంతరహిత దైవమా
అధములు నిన్ను సమరయుడనిర - నాథుడా నిన్ను బహు దూషించిరా || పూజ ||
4. దూషించు శత్రుసమూహములన్ - దీవించి ఎంతో క్షమించితివి
దూషకుడవని నిన్ను దూషించిర - దోషరహితుడా నా యేసు ప్రభు || పూజ ||
5. దయ్యములు నినుజూచి వణకినను - దయ్యముల పారద్రోలినను
దయ్యములు పట్టిన వాడనిర - ఓ దయామయ నా యేసుప్రభు || పూజ ||
6. మధురం నీ నామం అతి మధురం - మధర గీతముతో నిన్నారాధింతును
వధియించబడితివ ఈ పాపికై - వందితా ప్రభు నిన్ను పూజింతును || పూజ ||
