18px
#433Telugu Spiritual Song

Ne paadeda nityamu paadeda-Prabhuvaa neeku stuti paadedan

నే పాడెద నిత్యము పాడెద - ప్రభువా నీకు స్తుతి పాడెదన్

ప|| నే పాడెద నిత్యము పాడెద - ప్రభువా నీకు స్తుతి పాడెదన్
1. మంచి కాపరి నీవైతివి - గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి పాపపు పాత్రను నీవే త్రాగితివి - రక్షణ పాత్రను నా కొసగితివి హర్షించి ప్రభు పాడెదను || నే పాడెద ||
2. గొప్పకాపరివి తోడైయున్నావు - ప్రతి అవసరతల్ తీర్చుచున్నావు నా ప్రాణమునకు సేదనుదీర్చి - మరణలోయలలో తోడైయుందువు యాత్రలో పాడుచు వెళ్లేదను || నే పాడెద ||
3. ఆత్మల కాపరి సత్యవంతుడవు - గొర్రెలన్నిటికి కాపరి నీవై ద్వేషించెదవు దొంగకాపరులన్ - నీ గొర్రెలు నీ స్వరమును వినును హృదయపూర్తిగ పాడెదను || నే పాడెద ||
4. ప్రధాన కాపరి ప్రేమామయుడవు - త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు మహిమకిరీటము నాకొసగెదవు - పరమనగరమందు నన్నుంచెదవు ఎలుగెత్తి ప్రభు పాడెదను || నే పాడెద ||