18px
#434Telugu Spiritual Song

Vijayundu kristu prabhaavamutho - ghana vijayundaayenu

విజయుండు క్రీస్తు ప్రభావముతో - ఘన విజయుండాయెను

ప|| విజయుండు క్రీస్తు ప్రభావముతో - ఘన విజయుండాయెను సాతానుని తలను చితుక ద్రొక్కెను - సదా రాజ్యమేలును
1. ఓ మరణమా నీ ముల్లుయెక్కడ? - ఓ సమాధి నీ విజయమెక్కడ? సిలువశక్తితో విరుగగొట్టెను - విజయుండు సర్వంబులో || విజయుండు ||
2. యూదా గోత్రంపు సింహమాయనే - గ్రంథమును విప్ప యోగ్యుండు తానే ఏడు ముద్రలను విప్పెడివాడు - యోగ్యుండు సర్వమందు || విజయుండు ||
3. ఆయనే శిరస్సు తన సంఘమునకు - మృతులలో నుండి ప్రథముడై లేచె మన ప్రభుయేసే మరణమును గెల్చె - సర్వములో ప్రధానుడై || విజయుండు ||
4. సింహాసనమందు వున్న మన ప్రభువే - పద్మరాగముల మరకతముల బోలి సూర్యకాంతివలె ప్రకాశించెను - జయమని పాడెదము || విజయుండు ||
5. ఆయన యెదుట సాగిలపడిరి - నాలుగు జీవులు పెద్దలందరును సర్వసృష్టికి దేవుండవని - ఆరాధించి మ్రెంుక్కిరి || విజయుండు ||
6. క్రీస్తుయేసు ద్వారా దేవునికే స్తుతులు - విజయమునిచ్చె తన ద్వారా మనకు అధిక విజయము మనకిచ్చు ప్రభువే - అందరిలో అతిశ్రేష్ఠుండు || విజయుండు ||