18px
#437Telugu Spiritual Song

Sarvonnathuni chaatuna nivasinchedi vaade Sarva shakhtuni

సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే - సర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత

1. సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే - సర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత యిదియే తన రెక్కల క్రింద ఆశ్రయము - తన రెక్కలతో కప్పును
2. ఆయనే నా ఆశ్రయము - నా కోటయు దుర్గమును ఆయన సత్యము నా కేడెమును - నేనమ్ముకొను దేవుడు || తన ||
3. పగటి బాణముకైనా - రాత్రి భయమునకైనా చీకటిలో తిరుగు తెగులుకైనా - నేనేమి భయపడను || తన ||
4. వేయి పదివేలు - కుడిప్రక్కను కూలినను దయచూపు దేవుడు నీకుండ - అపాయము రాదు || తన ||
5. నీ ప్రభువాశ్రయమే - యెహోవా నివాసం అపాయము తెగులు - నీ గుడారము సమీపించవు || తన ||
6. నీదు మార్గంబులలో - నిన్ను దూతలు కాయున్ పాదములకు రాయి - తగులకుండ నిన్నెత్తుకొందురు || తన ||
7. కొదమ సింహముల - నాగుపాములనణచెదవు అతడు నా నామము నెరిగెను - అతని తప్పించెదను || తన ||
8. అతడు నను ప్రేమించెన్ - నామమున మొరపెట్టెన్ అతని విడిపించి ఘనపరతున్ - అతని కుత్తరమిత్తున్ || తన ||