18px
#438Telugu Spiritual Song

Devaa naa hrudayam unee - yandu stiramaayen

దేవా నా హృదయము - నీయందు స్థిరమాయెన్

ప|| దేవా నా హృదయము - నీయందు స్థిరమాయెన్ నే పాడుచు స్తుతింతున్ - నా యాత్మగానము చేయున్
1. స్వరమండలమా సితారా - మేల్కొనుడి మీరు కూడా వేకువనే నే లేచెదను - స్తుతిగానము చేసెదను || దేవా ||
2. దేవా నీ జనముల మధ్య - కృతజ్ఞతా స్తుతులను చెల్లించి ప్రజలలోన - స్తుతిగానము చేసెదను || దేవా ||
3. ఆకాశమున కంటె నీ - కృప మహోన్నతమైనది నీదు సత్యము మేఘములకంటె - అత్యున్నతమైనది || దేవా ||
4. దేవా నీ వాకాశముకంటె - మహోన్నతుడవు కమ్ము నీదు మహిమ సర్వభూమి - మీద వ్యాపించును గాక || దేవా ||