18px
#439Telugu Spiritual Song

Raajulaku raajaina - yesu prabhu ranai yunnaadu

రాజులకు రాజైన యేసుప్రభువు రానైయున్నాడు

ప|| రాజులకు రాజైన యేసుప్రభువు రానైయున్నాడు(2) ఎత్తబడెదవా లేక విడువబడెదవా?(2)
1. తెలిసికొంటివా నీవెంత ఘోరపాపివో - సిలువపై తీర్చెగా నీ పాపఋణమున్ ఒప్పుకొనిన పాపమున్ క్షమించును యేసు - లేనియెడల విడువబడెదవు సిద్ధపడుమా
2. బుద్ధిలేని కన్యలవలె మోసపోతివా - చేయలేవు ప్రభుసేవ నీ శక్తితో నూనెలేక భ్రమతో బ్రతికెదవా - లేనియెడల విడువబడెదవు సిద్ధపడుమా
3. వాక్యముకై జీవితం అప్పగింపక - దాచితివా తలాంతులను లెక్కచేయక మొదటి ప్రేమను తిరిగి పొందుమా - లేనియెడల నష్టపోదువు సిద్ధపడుమా
4. ప్రాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో - కృపనుబట్టి నడిపితివి నాదు యాత్రలో ముగియువరకు సిద్ధపరచు నీ రాకకై - హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయ