#440Telugu Spiritual Song
Devuniki stotramu gaanamu - Cheyutaye manchidi
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
ప|| దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
1. యెరూషలేము నెహోవాయే - కట్టుచున్న వాడని
ఇశ్రాయేలీయులను - పోగుచేయువాడని || దేవునికి ||
2. గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని || దేవునికి ||
3. నక్షత్రముల సంఖ్యను - ఆయన నియమించెను
వాటికన్నియు పేరులు - పెట్టుచున్న వాడని || దేవునికి ||
4. ప్రభువు గొప్పవాడును - అధికశక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని || దేవునికి ||
5. దీనులకు అండాయనే - భక్తిహీనుల గూల్చును
సితారాతో దేవుని - స్తుతులతో కీర్తించుడి || దేవునికి ||
6. ఆయన ఆకాశము - మేఘములతో కప్పుచు
భూమి కొరకు వర్షము - సిద్ధపరచువాడని || దేవునికి ||
7. పర్వతములలో గడ్డిని - పశువులకు మొలిపించును
అరచు పిల్ల కాకులకును - ఆహారము తానీయును || దేవునికి ||
8. గ్రురముల నరులందలి - బలము నానందించడు
కృపకు వేడువారిలో - సంతసించువాడని || దేవునికి ||
9. యెరూషలేమా యెహోవాను - సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము - ఆనందించువాడని || దేవునికి ||
10. పిల్లల నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్
మంచి గోధుమ పంటతో - నిన్ను తృప్తిగ నుంచును || దేవునికి ||
11. భూమికి తన యాజ్ఞను - యిచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని - వాక్యము పరుగెత్తును || దేవునికి ||
12. వాక్యమును యాకోబుకు - తెలియజేసినవాడని
ఏ జనము కీలాగున - చేసియుండలేదని || దేవునికి ||
