#441Telugu Spiritual Song
Stotrintumu ninu maadu thandri - satyamutho, atmatho nepudu
స్తోత్రింతుము నిను మాదు తండ్రి - సత్యముతో, ఆత్మతోనెపుడు
ప|| స్తోత్రింతుము నిను మాదు తండ్రి - సత్యముతో, ఆత్మతోనెపుడు
అ.ప. పరిశుద్ధాలంకారములతో - దర్శించెదము శరణం శరణం
1. శ్రేషష్ఠఈవుల యూటనీవే - శ్రేషష్ఠకుమారుని యిచ్చినందున
త్రిత్వమై యేకత్వమైన త్రి - లోకనాథా శరణం శరణం || స్తో ||
2. పాపిమిత్రుడ పాపనాశక - పరమవాసా ప్రేమపూర్ణా
వ్యోమపీఠుడా స్వర్ణమయుడా - పరిశుద్ధాంగుడ శరణం శరణం || స్తో ||
3. ధవళవర్ణుడ రత్నవర్ణుడ - సత్యరూపి యనబడువాడా
నను రక్షించిన రక్షకుండవు - నాథ నీవే శరణం శరణం || స్తో ||
4. బంగారు వెం్రటుకలు తలపై - ఉంగరములుగ కనబడినవి
వేలలో నతికాంక్షణీయుడా - వేలకొలది శరణం శరణం || స్తో ||
5. గువ్వలవంటి కన్నులు - పువ్వుల వంటి చెక్కిళ్లు
మంచి రూపము కలిగినందున - మాకు నీవే శరణం శరణం || స్తో ||
6. చేతులు బంగారుమయము - చెక్కిన రత్నములవంటివి
కాళ్లు రాతిస్తంభములవలె - కన్పడుచున్నందున శరణం || స్తో ||
7. సంఘమునకు శిరస్సు నీవే - రాజా నీకే నమస్కారములు
ముఖ్యమైన మూలరాయి - కోట్లకొలది శరణం శరణం || స్తో ||
8. నీదు సేవకుల పునాది - జ్ఞానమునకు మించిన తెలివి
అందముగను కూడుకొనుచు - వేడుకొందము శరణం శరణం || స్తో ||
9. రాజ నీకే స్తుతి స్తోత్రములు - గీతములు మంగళ ధ్వనులు
శుభము శుభము శుభము నిత్యం - హల్లెలూయా ఆమేన్ ఆమేన్ || స్తో ||
