18px
#443Telugu Spiritual Song

O premagala yesu-preminchi naavu mammu

ఓ ప్రేమగల యేసు - ప్రేమించినావు మమ్ము

ప|| ఓ ప్రేమగల యేసు - ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ - రక్షణ నిచ్చినావు
1. అద్భుత యాగమందు - అందరికై బలియై అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి || ఓ ||
2. దాసులమై మేముండ - మోషేను పంపితివి చేసితివి స్వతంత్రులుగా - నీ బాహుబలముతోడ || ఓ ||
3. క్షమాపణానందముతో - సాగింపచేసి మమ్ము యాత్రలో మాకు తోడై విజయము నిచ్చితివి || ఓ ||
4. ఎడారి అడవిలోన ఊటల నదులు నడిపి ఎండిన నేలనంత - పచ్చిక బయలు చేసెన్ || ఓ ||
5. బాబెలు నుండి మమ్ము - విడిపించితివి నీవు బంధకముల తెంచి - తప్పు బోధ బాపినావు || ఓ ||
6. సహవాసమిచ్చి సంఘ - అంగముల జేసినావు సాక్షులను చేసి మమ్ము - శత్రువుల సిగ్గుపరచె || ఓ ||
7. మహాప్రేమగల యేసు - మాకై చేసితివన్ని ఘనపరతు హల్లెలూయ - ఈ గొప్ప రక్షణ కొరకు || ఓ ||