#444Telugu Spiritual Song
Hrudaya marpinchedamu - Prabhunaku stuti prashamshalatho
హృదయ మర్పించెదము ప్రభునకు - స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి
ప|| హృదయ మర్పించెదము ప్రభునకు - స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి
1. పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్
పాపుల పాపము తొలగించుటకు - నిత్య జీవము నిచ్చెన్ || హృదయ ||
2. సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై
రక్షణ ద్వారము తెరచెను ప్రభువు - నిత్య నిరీక్షణ నిచ్చెన్ || హృదయ ||
3. ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే
తిరిగి వెళ్లక పాపమునకు - నిలువకు పాపములో || హృదయ ||
4. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం
కాపాడు మా జీవితముల - ఇదియే మా వినతి || హృదయ ||
