18px
#445Telugu Spiritual Song

Oh naa hrudayamaa paadumaa - Krotha geetham prabhunake

ఓ నా హృదయమా పాడుమా - క్రొత్త్త గీతం ప్రభునకే యెంతో

ప|| ఓ నా హృదయమా పాడుమా - క్రొత్త్త గీతం ప్రభునకే యెంతో ఆనందం వర్ణింపజాల యెంతో - ప్రభువు ప్రేమ హృదయమా పాడుమా
1. క్రీస్తునందు స్వాస్థ్యము చేసె - తన సంకల్పం అద్భుతమది భూమి పునాది వేయక మునుపే ఏర్పరచు కొనెను - హృదయమా పాడుమా || ఓ ||
2. క్రీస్తునందు నన్ను క్షమించి - రక్తము కార్చి కడిగెను నన్ను విడిపించి నన్ను నీతిగా తీర్చి - పవిత్రపరచెను హృదయమా పాడుమా || ఓ ||
3. క్రీస్తులో నన్ను దరికి పిల్చి - చేర్చి క్రొత్త్త వ్యక్తిగ జేయ కూల్చెను ప్రభు ఆ మధ్యపు గోడ - కోరిచేరియుండెను - హృదయమా పాడుమా || ఓ ||
4. క్రీస్తులోయున్న యే శిక్షలేదు - స్వాతంత్ర్యము క్రీస్తునందే క్రీస్తే పరమున కూర్చుండబెట్టి - క్రొత్త్త సృష్టిగ జేసె హృదయమా పాడుమా || ఓ ||
5. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం - శాంతి ఆనందం దొరికెను మనకు క్రీస్తు మహిమ జయముకై పిలిచె - హల్లెలూయ పాటను హృదయమా పాడుమా || ఓ ||