#446Telugu Spiritual Song
Devaa nee thalampulu - Ammoolya mainavi naa yeda
దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
ప|| దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
నా యెడల నీ కరుణ సర్వసదా నిలుచుచున్నది
1. స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే - స్తుతి పాడెద హృదయముతో
స్తుతించి వర్ణించి ఘనపరతున్ - నీవే నా రక్షకుడవని || దేవా ||
2. మొదట నిన్ను యెరుగనైతిని - మొదటే నన్ను యెరిగితివి
వెదకలేదు ప్రభువా నేను - వెదకితివి ఈ పాపిని || దేవా ||
3. మరణమగు ఊబిలో నుంటిని - కరుణ నిలిచె నన్ను రక్షింప
మరణము నుండి రక్షింప నన్ - నా ప్రభు బలియాయెను || దేవా ||
4. పాపలోకములో మునిగియుంటిని - పాపశిక్షకు పాత్రుడను
యేసుప్రభు సిలువ సహించెను - నాకు నూతన జీవమొసగ || దేవా ||
5. అద్భుతమైనది సిలువ దృశ్యం - ప్రభువును కొట్టి ఉమ్మివేసిరి
ప్రభువును వర్ణింప నశక్యము - ప్రభువే సహించె దుఃఖము || దేవా ||
6. యెట్లు మౌనముగా నుందు ప్రభూ - చెల్లింపక స్తోత్ర గీతము
కాలమంతా పాడుచుండెద - నీ ప్రేమ అపారమైనది || దేవా ||
