#447Telugu Spiritual Song
Yesu kristu prabhuvaayane andariki prabhuvu
యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు
ప|| యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు
పశువుల పాకన్ పరుండెను తానే దేవుడై యుండి
1. నరులన్ గావన్ శ్రమల బొందెను క్రీస్తు ప్రభువు
తిరిగెన్ భువిన్ సుఖమున్ విడచి - శిష్యులు వెంటనుండన్ || యేసు ||
2. నిత్యజీవం నిత్యశాంతి నిండు నెమ్మది
నిత్యుండేసు మనకు నివ్వ - మృత్యువున్ గెల్చెను || యేసు ||
3. భీతిన్ గొలుపు అలలు పైకి లేచినంతనే
భీతిన్ విడచి యేసు వైపు - చూడు నిమ్మళించును || యేసు ||
4. మరణమేలు లోయలందు సంచరించెడు
తరుణములు కలిగినను - క్రీస్తు మీ చెంతనుండున్ || యేసు ||
5. మన జీవము క్రీస్తేగదా క్రీస్తున్ తేరిచూచి
తనయులమై యుద్ధమందు - జయము నొందెదము || యేసు ||
