#449Telugu Spiritual Song
Mahaa ghanudu mahonnathudu - Parishuddudu nitya nivaasi maa
మహాఘనుడు, మహోన్నతుడు - పరిశుద్ధుడు, నిత్యనివాసి
ప|| మహాఘనుడు, మహోన్నతుడు - పరిశుద్ధుడు, నిత్యనివాసి
మా సామర్థ్యము పునరుత్థానము - మా జీవము మా రక్షణనిధి
1. ఉన్నత పరిశుద్ధ స్థలములలో - నివసించువాడు పరిశుద్ధుడు అయినను
నలిగిన వినయంపు దీనమనస్సులో - నివసించును జీవించును || మహా ||
2. దినమెల్ల ప్రభుకై వధియింపబడియున్నట్టి - గొర్రెలము అయినను
ప్రేమించినవాని ప్రేమను బట్టియే - పొందితిమి విజయమును || మహా ||
3. మోసము, శిక్షయు, దుఃఖమును, దరిద్రత కలిగియున్నాము
అయినను సత్యము, జీవము, సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి || మహా ||
4. పడిపోయి మేముంటిమి - అంధకారమందుంటిమిగా
అయినను తిరిగి లేతుము - యెహోవాయే మా వెలుగు మా రక్షణ || మహా ||
5. మన క్రీస్తును బట్టి యెల్లప్పుడు - నిందకు పాత్రులమైతిమి
అయినను ఎల్లప్పుడు ఊరేగించును - మమ్ము విజయముతో స్తోత్రములు || మహా ||
