#450Telugu Spiritual Song
Koniyadi paadi keertinchi-Varnincheda ninu naa prabhuvaa
కొనియాడి పాడి కీర్తించి - వర్ణించెద నిను నా ప్రభువా
ప|| కొనియాడి పాడి కీర్తించి - వర్ణించెద నిను నా ప్రభువా
1. పరిశుద్ధుడవు నీతిమంతుడవు - పాపపు వస్ర్తము మార్చిన దేవ
ప్రాపుగ రక్షణ వస్ర్తమిచ్చితివి - పొగడెద నిన్ను ధవళవర్ణుడా || కొని ||
2. తూర్పు జ్ఞానులు నీకర్పించిరి - బంగారు సాంబ్రాణి బోళము
తెలుపబడెను నీ ఘన విజయము - భజియించెద నిన్ను రత్నవర్ణుడా || కొని ||
3. గుర్తించెద నిన్ను ఘనముగా నేను - ఘనుడా నాకు ప్రభుడవు నీవే
పదివేలలో నా ప్రియుడగు ప్రభువా - పరికించి నిన్ను పాడి స్తుతించెద || కొని ||
4. ఆరాధించెద ప్రభువా దేవా - ఆత్మతోను సత్యముతోను
తిరిగి రానైయున్న ప్రభువా - స్తుతియు ఘనత - మహిమయు నీకే || కొని ||
