#451Telugu Spiritual Song
Devaa naa yandu neeku entho prema
దేవా నా యందు నీకు - ఎంతో ప్రేమ
ప|| దేవా నా యందు నీకు - ఎంతో ప్రేమ
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
హల్లెలూయా.......(4)
1. దినదినము నీదు ప్రేమ - రుచి చూచుచున్నాను
దయగల జీవాహారముతో పోషించుచున్నావు
దేవా! నీ జీవజలము నాకిచ్చితివే - నీ దివ్యప్రేమ నాలో ఉప్పొంగెను || హల్లె ||
2. నా పాదములను నీవు - బండపై నిలిపితివి
నా యడుగుల నెల్ల నీవు స్థిరపరచిన దేవుడవు
దేవా! నాకాశ్రయుడవు నీవే కదా - నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను || హల్లె ||
3. సిలువలో నీ రక్తము కార్చి - నన్ను రక్షించితివి
సార్వత్రిక సంఘములోన - నన్నైక్య పరచితివి
దేవా! నీ దయ నాయెడల అత్యున్నతము - నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను || హల్లె ||
4. వాగ్ధానములను నాలో - నెరవేర్చిన ఓ ప్రభువా
విడువక నా యెడల నీదు - కృప జూపుచున్నావు
దేవా! నీ మారని ప్రేమ సంపూర్ణము - నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను || హల్లె ||
5. మృతిని గెల్చి మా కొరకై - తిరిగి లేచిన ప్రభువా
మా కొరకై త్వరలో రానై - యున్న మహిమరాజా
దేవా! నీ సన్నిధి నాకు ఎంతో ప్రియము - నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను || హల్లె ||
